వరంగల్ జిల్లా: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా అదివారం వరంగల్ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని సర్క్యూట్ హౌజ్‌లో జిల్లా కలెక్టర్ కిషన్‌తో పాటు అధికారులతో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. సోమవారం అదిలాబాద్ , కరీంనగర్ , ఖమ్మం అధికారులతో అయన సమావేశం కానున్నారు.




