Tuesday, 3 November 2026

రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

చిత్తూరు: అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు
ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి
చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన 232 ఎర్రచందన దుంగలను అధికారులు స్వాధీనం
చేసుకున్నారు. చిత్తూరు. డీఎస్పీ రాజేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ దాడిలో పాకాల సీఐ
వెంకటనారాయణ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *