ఆందోళన చేపట్టిన ట్రైడెంట్ కార్మికులుగుట్టు చప్పుడు కాకుండా చక్కెర తరలించేందుకు ప్రయత్నం
జహీరాబాద్ జనవరి 31 (జనం సాక్షి) పిఎఫ్ , ఎల్ఐసి బకాయి డబ్బుల కోసం కార్మికులు ట్రైడెంట్ చక్కర కర్మగారం ముందు బైఠాయించి, ధర్నా దిగారు. మంగళవారం సుమారు రూ.2 కోట్ల బకాయిలు యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సి ఉంది. బకాయిల విషయమై గత కొంతకాలంగా పలుదాఫాలుగా ట్రైడెంట్ యాజమాన్యంతో కార్మిక నాయకులు చర్చలు జరిపారు. అప్పుడు , ఇప్పుడుఅంటూ కాలయాపన చేస్తున్న యాజమాన్యం చివరిగా జనవరి 31 సాయంత్రం 5 గంటల లోపు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినప్పటికీ ఒప్పందం ప్రకారం వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా చక్కెరను తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్ఞ సమాచారం తెలుసుకున్న కార్మికులు చివరిసారిగా తమ పిఎఫ్, ఎల్ఐసి బకాయి డబ్బులు విషయమై యాజమాన్యంతో సంప్రదించారు.
అయినప్పటికీ స్పందన రాకపోవడంతో చివరి అస్త్రంగా ఆందోళనకు దిగారు.
ఆందోళన కార్యక్రమంలో ట్రేడ్ అధికార కార్మిక యూనియన్ అధ్యక్షులు , ఎంజీ. రాములన్న, కార్మిక నాయకులు రాజరత్నం, జగదీశ్వర్, నాగేష్ పాటిల్ , రాజు , పెంటన్న, తుకారం, రాజేశ్వర్ రెడ్డి , యూసుఫ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్మాగారం వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి కార్మికులతో చర్చలు జరుపడనికి సిద్ధం అయ్యారు.
-మద్దతు తెలిపిన ప్రజా ప్రతినిధులు
కార్మికులు చేస్తున్న ఆందోళనకు కర్మగారం పరిధిలోని పలువురు సర్పంచులు, నేతలు మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో తుమ్ కుంట సర్పంచ్ రాజు, బూర్దిపాడు సర్పంచ్ అబ్రహం, కొత్తూరు( బి) సర్పంచ్ జగదీష్ , దిడిగి సర్పంచ్ కరణ్ రాజ్, రాయిపల్లి (డి )సర్పంచ్ విజయ్, హుగ్గేల్లి సర్పంచ్ రాజు , ఎంపీటీసీ సభ్యులు రాములు ఇతర నాయకులున్నారు.




