రెండవ ఏఎన్ఎం ల సమస్యలు తక్షణం పరిష్కరించాలి.
డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి) రెండవ ఏఎన్ఎంల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఎన్ఎంల దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం దీక్ష శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ ఏఎన్ఎంల పట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకునూరి బాలరాజు. నాగుల సత్యనారాయణ గౌడ్, కాముని వనిత, సురా దేవరాజు పలువురు నాయకులు పాల్గొన్నారు. దీక్షల్లో పలువురు రెండవ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.