-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 4 (జనం సాక్షి);
రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మరొకసారి విచారించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తహసిల్దారులు, ఎంపీడీవోలు, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేసిందని, జోగులాంబ గద్వాల జిల్లాలో 22 వేల మందిని గతంలో ఎంపిక చేసి సగం మందికి గొర్రెల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన సగం మంది లబ్ధిదారులకు 2017లో తయారుచేసిన లబ్ధిదారుల సి జాబితాను మళ్ళీ రి వెరిఫికేషన్ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫార్మాట్లో పొందుపరిచిన వివరాల ప్రకారంగా లబ్ధిదారుని ఎంపిక జరగాలని తెలిపారు. అప్పటి లబ్ధిదారుడు గ్రామంలోనే ఉన్నాడా, లేదా, వలస వెళ్లాడా, మరణించాడా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా తదితర వివరాలను పొందుపరచాలని అన్నారు. జీవో ఎంఎస్. 61 ప్రకారం గొల్ల, కుర్మా, కుర్బా లకు సంబంధించి వి ఆర్ ఏ , ఎం ఆర్ ఓ ఎంపీడీవో లు ఆధ్వర్యంలో మండల కమిటి సమావేశం ఏర్పాటు చేసి వాటికి సర్పంచులను ఆహ్వానించి గొర్రెల పంపిణీ పథకంపై తెలియ
జేయాలన్నారు.కొత్తగా ఎవరిని ఎంపిక చేయవద్దని, పాత జాబితాలో ఉన్న వారి పేర్లను మాత్రమే పూర్తిస్థాయిలో విచారించి నివేదికలు త్వరగా పంపాలని ఎంపీడీవో, తాసిల్దార్ పశుసంవర్ధక శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.అనంతరం పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల గురించి మాట్లాడుతూ వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీరు పట్టాలని ఆదేశించారు.ప్రతి శుక్రవారం వాటరింగ్ డే పై ప్రత్యేక దృషి పెట్టాలని, గ్రామపంచాయతీ పరిధిలో వేసవిలో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనులు జరిగే చోట మిషన్ భగీరథ ద్వారా నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, తాసిల్దారులు,
తదితరులు పాల్గొన్నారు.
రెండవ విడత గొర్రెల పంపిణీ లో అసలైన లబ్ధిదారులని ఎంపిక చేయాలి




