నెన్నెల, మే 10, (జనంసాక్షి )రెండవ విడత గొర్రెల పంపిణీని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ అన్నారు. బుధవారం నెన్నెల మండలం చిత్తపూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన గొర్రెల పెంపకం దారుల అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడత లబ్ధిదారులు రూ. 43700 చెల్లించి నాణ్యమైన గొర్రెలను పొంది తద్వారా ఆర్థికాభివృద్ధి సాదించాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, పశు వైద్యాధికారి దిలీప్, సర్పంచ్ బత్తిని పద్మ – వెంకటేష్ గౌడ్, బీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, గొర్రెల పెంపకం దారులు పాల్గొన్నారు.




