మరిపెడ,మే 10(జనం సాక్షి ):మున్సిపల్ కేంద్రంలోని మూడవ వార్డ్ లో బుధవారం మరిపెడ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డోర్నకల్ శాసనసభ్యులు డీ ఎస్ రెడ్యానాయక్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నూతన పోలీస్ కార్యాలయంతో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించబడుతాయని వారు అన్నారు,గతంలో కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోయిన ఈ స్టేషన్ నిర్మాణపనులు ఇప్పుడు మళ్ళీ ప్రారంభం కావడం సంతోషకారం అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూగులోత్ సింధూర రవి నాయక్, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, తేజవాత్ శారద రవీందర్, సిఐ ప్రేమ్ సాగర్, ఏసైలు పవన్ కుమార్, సంతోష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు రేఖ లలిత వెంకటేశ్వర్లు, భానోత్ కిషన్, ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మాచర్ల స్రవంతి భద్రయ్య, భయ్యా బిక్షం,గందసరి ఉపేంద్ర లింగమూర్తి,బీఆర్ఎస్ నాయకులు కుడితి మహేందర్ రెడ్డి, రామడుగు అచ్యుత్ రావు, గుగులోత్ వెంకన్న,నారెడ్డి సుదర్శన్ రెడ్డి, నా రెడ్డి చందు రెడ్డి,దిగ్గజర్ల ముకేష్, అజ్మీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు




