హైదరాబాద్: మౌలాలి వద్ద రెండు గూడ్స్ రైళ్లు వెనుకనుంచి ఢీకొన్నియి. దీంతో రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సరకులు లోడ్ చేస్తుండగా లింకు తెగి రెండు రైళ్ల వ్యాగన్లు వెనక నుంచి ఢికొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలిలో మరమ్మతు పనులు చేపట్టారు.




