Tuesday, 3 November 2026

రెండు పడకల ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానం…

భైంసా పట్టణంలోని అర్హులు గల నిరుపెదప్రజలు రెండు పడకల ఇండ్ల కొరకు అప్లై చేసుకోవాల్సిందిగా, కలెక్టర్ ఆదేశాల మేరకు బైంసా ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. బైంసా మొత్తం అన్నివార్డులలో సంబంధిత అధికారులు ఉంటారని,ఈ నెల ఐదో తేది నుండి ఏడవ తేది వరకు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమ0 కాగా,సమయం ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు. అర్హులు  గలవారు దరఖాస్తుదారుని ఫారం,ఆధార్ కార్డు,రేషన్ కార్డు, సంబంధిత పత్రాలు వె0ట తీసుకుని రావలసిందిగా తెలిపారు.