Tuesday, 3 November 2026

రెండు పెన్షన్లు రావని గుర్తుంచుకోండి

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఒకరికి ఒకటే పెన్సన్‌ వస్తుందని, రెండు పొందుదామనుకునే వారు అలాంటి ఆలోచన మానుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తప్పుడు వివరాలు ఇచ్చేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెండురకాల పింఛన్లను ఇప్పిస్తామని కొంతమంది దళారీ నాయకులు పుట్టుకొచ్చే అవకాశముందని.. వారిని ఎవరూ నమ్మవద్దన్నారు. ఏ ఒక్కరికీ రెండురకాల పింఛన్లు ఎట్టి పరి/-థసితుల్లోనూ రావని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో బీడీకార్మికురాలిగా నమోదు చేసుకోని వారికి ఆసరా పింఛన్‌ జాబితాలో చోటు కల్పించలేదన్నారు. పథకాన్ని పొందడానికి అన్ని అర్హతలుంటే నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆలస్యమైనా మార్చి నెల నుంచే వారికి భృతి చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత ఎంతోమంది బీడీపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. అలాంటి వారికి న్యాయం చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.  అర్హులైనవారందరికీ ఈ భృతిని అందజేస్తామని చెప్పారు. సిఎం కెసిఆర్‌ ఎన్నో చర్యల ద్వారా  అభివృద్ధి వైపు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. రైతుల ప్రయోజనార్థం గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని పంచాయతీభవనాలను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇందిరమ్మ పథకంలో అక్రమాలపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పట్టణంలో బీడీ కార్మికుల సౌకర్యార్థం 50 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి, పీఎఫ్‌ ఉప కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో పొదుపు చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా తగిన ప్రోత్సాహం కల్పించాలని, బాగా చదివించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *