రెండు వికేట్లు కోల్పోయిన భారత్
బెంగళూరు: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి. 40 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలోనే గంభీర్ వికెట్ను కోల్పోయింది. సౌతీ బౌలింగ్లో గంభీర్ 2 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం పుజారా కూడా సౌతీ బౌలింగ్లో బోల్ల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం సెహ్వాగ్ 20, సచిన్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు కివీస్ 365 పరుగులకు ఆలౌట్ అయింది.