మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్8నియోజకవర్గంలో రెండు వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎమ్మెల్యే శ్వేత పత్రం విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ డిమాండ్ చేశారు. హాథ్ సే హాత్ పాదయాత్రలో భాగంగా కేశవ నగర్ లో గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి కొరకు 8 సంవత్సరాల క్రితం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తూ ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాటా 50 శాతం నిధులు ఇవ్వకపోవడంతో ఇంకా పనులు మొదలు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్కెపురం చెరువు,బండ చెరువు సుందరీకరణ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపి రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,గుత్తి రామ్ చందర్,వినోద యాదవ్, సానాది శంకర్,ఉమేష్ సింగ్,అలీ, శ్రీనివాస్,వంశీ ముదిరాజ్,రాములు, నర్సింగరావు,రాములు గౌడ్,సాయి, అవినాష్,సుబ్బారెడ్డి,డోలీ రమేష్,కుట్టి శ్రీను,సాయి కుమార్,మహేందర్,బుచ్చి బాబు,స్వప్న,మాధవి తదితరులు పాల్గొన్నారు.




