రెండోరోజు జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌజ్‌ నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్రను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యలు పాల్గొన్నారు. తెలంగాణ ఫైల్‌ ఇంకా మూసివేయలేదు, ఎప్పుడైనా తెరవవచ్చునని కేంద్రహోంశాఖ మంత్రి షిండే చేసి వ్యాఖ్యలను కోదండరాం తీవ్రంగా ఖండించారు. కాగా, కాంగ్రెస్‌ నేతలు తమ పదవులను వదిలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాలని, లేకుంటే నేతల ఇళ్లను ముట్టడిస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.