రెండో బ్లాక్ బాక్స్ దొరికింది

మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం ఆధారంగా ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశముంది.  రెండో బ్లాక్ బాక్స్ లో విమానానికి సంబంధించిన సాంకేతిక సమాచారంతో పాటు ప్రమాదానికి ముందు చివరి నిమిషాల్లో ఏం జరిగిందనేది వెల్లడికానుంది.
కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేశాడని అంతకుముందు దొరికిన మొదటి బ్లాక్ బాక్స్ లోని సమాచారం ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. అతడు మానసిక రోగి అని తేల్చారు. తన పేరు విశ్వమంతటా మారు మోగిపోవాలన్న దుష్టచింతనతో అతడీ ఘోరకృత్యానికి పాల్పడ్డాడు