హైదరాబాద్: ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా హైదరాబాద్-కాకినాడ మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఇవాళ రాత్రి 11 గంటలకు హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, రేపు సాయంత్రం 6,30గంటలకు కాకినాడ-సికింద్రాబాద్‌ల మధ్య, 4న రాత్రి 11.50గంటలకు సికింద్రాబాద్-కాకినాడ మధ్య, 5న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడ-హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు నడువనున్నాయని దక్షిణ మధ్యే రైల్వే అధికారులు వెల్లడించారు.





