హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కోవాన్ (4) కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు మూడో ఓవర్‌లో వార్నర్ (6) కూడా కుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆసీన్ రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులతో ఆడుతోంది.




