బాపట్ల : రాష్ట్రానికి అదనపు గ్యాస్ కేటాయించే విషయంపై పరిశీలిస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గ్యాస్ కేటాయింపులపై మంత్రుల బృందం చర్చిస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కోత తీవ్రంగా ఉందని అదనపు గ్యాస్ కేటాయింపులపై మంత్రుల బృందం చర్చిస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కోత తీవ్రంగా ఉందని అదనపు గ్యాస్ కేటాయించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు కేంద్రాన్ని కోరారని చెప్పారు. రాష్ట్ర వినతిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ధరలకనుగుణంగా పెట్రోలు ధరలు పెంచే అధికారం చమురు సంస్థలకే ఉందని ముడిచమురు బ్యారెల్ ధర 138 డాలర్లకు చేరుకోవడంతో పెట్రోలు ధర పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాసంక్షేమ బడ్జెటని ప్రశంసించారు. మహిళలకు ప్రత్యేకంగా జాతీయ బ్యాంకు ఏర్పాటు చేయడంతోపాటు నిర్భయ్ నిధుల కింద రూ. 1000 కోట్లను కేటాయించడం అభినందనీయమన్నారు.




