Wednesday, 4 November 2026

రెండో విడత కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్ సరిత

 

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి,ఫిబ్రవరి 9 (జనం సాక్షి): టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను గురువారం గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందానికి సహకరించి అందరూ హాజరై పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు సభ్యులు నోముల భానుచందర్, వైద్య బృందం పాల్గొన్నారు.