*
10-02-2023న రాత్రి ఇల్లందు రాజీవ్ నగర్ లో బస చేయనున్న రేవంత్ రెడ్డిటేకులపల్లి, ఫిబ్రవరి 9( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనముల రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్న నేపద్యంలో ఇల్లందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్రలో భారీగా పాల్గొనేందుకు టిపిసిసి సభ్యులు చీమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా 10-02 2023 వ తేదిన రాత్రి ఇల్లందు మండలం రాజీవ్ నగర్ చేరుకోని బస చేయనున్నందున స్ధల ఏర్పాట్లను చీమల వెంకటేశ్వర్లు పరిశీలించారు. వారితో పాటు ఇల్లందు మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు, ఐ ఎన్ టి యు సి నాయకులు త్యాగరాజన్,శంకర్ నాయక్,లింగాల జగన్నాధం,కాయం రమేష్,గొగ్గెల పాపారావు తదితరులు ఉన్నారు.




