Thursday, 5 November 2026

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

 

టేకులపల్లి,జనవరి 19( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందత్వాన్ని దూరం చేయడానికి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంను నిర్వహిస్తున్నందున ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు అభిప్రాయపడ్డారు. గురువారం సులానగర్, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల ఉన్నతాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రదానంగా ప్రజలలో అంధత్వాన్ని దూరం చేయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం మండలంలోని 36 పంచాయితీ కేంద్రాలలో రెండు టీములుగా పనిచేస్తూ ఆయా పంచాయతీల పరిధిలోని గ్రామాల్లోని 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరికీ కంటి పరీక్షలు చేసి వెంటనే కళ్లద్దాల పంపిణీ, అవసరమైన వారికి మందులు అందిస్తారు. కంటి పరీక్షల నిర్వహణ కేంద్రము అడ్రస్సు,సమయము తెలియజేస్తూ రెండు రోజులు ముందుగా ప్రతి లబ్ధిదారునికి ఆహ్వానం ఆశా కార్యకర్తల ద్వారా అందజేయడం జరుగుతుందని, ఆహ్వానం అందిన లబ్ధిదారుడు ఇచ్చిన సమయం ప్రకారం మాత్రమే కంటి పరీక్షా కేంద్రానికి రావాలని అలాగే ఈకంటి వెలుగు కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ దినేష్ కోరారు. కంటి వెలుగు స్పెషలాఫీసర్ వేల్పుల విజేత కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు, ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, వైస్ఎంపీపీ ఉండేటి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు ఎండి మౌలానా, స్థానిక సర్పంచులు మాలోత్ సురేందర్ నాయక్, అజ్మీరా బుజ్జి, ఉప సర్పంచులు ఉండేటి బసవయ్య, చేతుల భద్రయ్య, ఎం పి ఓ లక్ష్మీ గణ