కొండమల్లేపల్లి మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కొండమల్లేపల్లి జనవరి 19 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం పి.హెచ్.సి సబ్ సెంటర్ లో గురువారం నాడు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారుమాట్లాడుతూ కేసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమమని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని తెలిపారు కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్.పి. లు, విఆర్ఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని వివరించారు ప్రజలు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని సూచించారు ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. కొండమల్లేపల్లి మండలంలోని ఎంపీడీవోలు తాసిల్దారులు మండల ప్రత్యేక అధికారి ప్రతిరోజు వారి పరిధిలో గల క్యాంపులను తనిఖీ చేయాలని మండల అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని ఆదేశించారు సామాన్య ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ,దేవరకొండ ఆర్ డి ఓ గోపిరామ్ నాయక్, ఎంపీడీవో బాలరాజు రెడ్డి, ఎమ్మార్వో మందడి మహేందర్ రెడ్డి, ఎంఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, జెడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దస్రు నాయక్, ఉప సర్పంచ్ గంధం సురేష్, ఈవో వీరబాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ కృష్ణకుమారి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి, క్యాంపు ఇన్చార్జ్ డాక్టర్ బాజెజా, డాక్టర్ దేవ్, క్యాంపు సూపర్వైజర్ హవీల్, ప్రేమలత కొడిదల వెంకటయ్య, బొడిగె శంకర్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని




