Thursday, 5 November 2026

రెండో విడత కంటి వెలుగు షురూ.


నేరడిగొండ జనవరి19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత వంద రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై 18 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ చికిత్స చేయించుకోవాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.గురువారం రోజున మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ ఎంపీపీ సజన్ రాథోడ్ సర్పంచ్ పెంటవెంకటరమణలు
ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు అట్టహాసంగా షూరైందని అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రంగా మార్చుటకు దృష్టి లోపం కలిగిన వారికి కంటి పరీక్షలు అవసరమైతే శస్త్రచికిత్స చేసి ఉచిత కంటి అద్దాలు మందులు అందజేస్తారని అన్నారు.ప్రతి ఒక్కరు కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్‌ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని,కంటి
శిబిరంలో దృష్టిలోపాలు గుర్తించిన వారికి అక్కడికక్కడే 50 మందికి రీడింగ్‌ గ్లాసులు పంపిణీ చేశారు.ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ అవసరం ఉన్నవారికి కాస్త ఆలస్యంగా అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎంపీడీఓ అబ్దుల్ సమద్ తాసిల్దార్ పవన్ చంద్ర ఎంపీఓ శోభన డా. సద్దాం ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి గణేష్ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి జీపీ సెక్రెటరీ మండల వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ ఆశవర్కర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.