Thursday, 5 November 2026

కంటి వెలుగు పథకం దేశంలోనే ఆదర్శం.

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి19/22

 

ఫోటో రైట్ అప్ 01తుర్కపల్లి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం.

 

తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అందత్వ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రమేలసత్పతి లు అన్నారు.గురువారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరులందరికీ కంటి పరీక్షలు,ఉచితంగా అద్దాలను మందులు,అందజేస్తారని తీవ్రమైన వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 25% మంది ప్రజలకు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, శుక్లాలు 43 శాతం, బాల్యంలో అందత్వం నాలుగు శాతం, నెలలు నిండని శిశువులకు నాలుగు శాతం, డయాబెటిస్ రేటినోపతి ఏడు శాతం, చూపు మందగించడం మూడు శాతం,నీటి కాసులు ఏడు శాతం తో బాధపడుతున్నారని, దేశంలో ఎక్కడి లేని విధంగా అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా కంటి వెలుగు పథకం ఒకటని,ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణ అందత్వ నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్,జెడ్పి వైస్ చైర్మన్ బిక్కు నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ జి శ్యాంసుందర్, ఎంపీడీవో నూనె ఉమాదేవి,పిహెచ్సి డాక్టర్ సుధీర్ రెడ్డి, సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్ ,పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి ,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి ,వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్ సర్పంచులు పోగుల ఆంజనేయులు వెన్నుకుచ్చి రామ్మోహన్ శర్మ ,కో ఆప్షన్ సభ్యుడు రహమత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,పిఎసిఎస్ డైరెక్టర్లు ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు..