రెచ్చిపోయిన ఇసుకమాఫియా
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. వలిగొండ మండలం గుర్నాథ్ పల్లి వద్ద ఇసుక రవాణా ను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిపై నిందితులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు… వలిగొండ మండలంలో గురువారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితులు సిబ్బంది పై దాడి కి దిగారు. ఈ సంఘటనలో తనిఖీల్లో పాల్గొన్న ఇద్దరు వీఆర్ఏలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్తానికంగా ఉండే ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.