Friday, 6 November 2026

మా కూతుర్ని చంపేశారు

జేసీ ఎదుట కస్సే రచన తల్లిదండ్రుల వాంగ్మూలం  
పెదపాడు : మా పాపను ఎవరో చంపేశారంటూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కస్సే రచన తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఫిబ్రవరి 25న వట్లూరులోని గురుకుల పాఠశాలలో రచన అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం పెదపాడు మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రచన మృతిపై జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు మేజిస్టీరియల్ విచారణ చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణ సాగింది. కస్సే రచన తల్లిదండ్రులు కొండలరావు, జ్యోతితో పాటు రక్త సంబంధీకులు, ఏఎన్‌ఎమ్, త్రీటౌన్ ఎస్సై ప్రసాద్‌కుమార్ తదితరులను జేసీ విచారించారు.
ఆ రోజు నా కుమార్తెను చూపించలేదు
నా కుమార్తెను గురువారం తీసుకుని వద్దామనుకున్నామని, అయితే బుధవారం చనిపోయిన వార్త తెలిసిందని తల్లిదండ్రులు చెప్పారు. మంగళవారం తాను వెళ్లి మా పాపతో మాట్లాడతానని ఎంతసేపు వేచి చూసినా రచనను చూపించలేదని తండ్రి కొండలరావు తెలిపారు. ఎవరూ వెళ్లినా పిల్లలను చూపిస్తారని కాని పాపను కావాలనే ఆ రోజు చూపించలేదని ఆరోపించారు. జనవరి 29న అదే పాఠశాలలో విద్యార్థిని ఉరిపోసుకుని చనిపోయిన కేసులో సాక్షిగా ఉన్న కారణంతోనే మా పాపను చంపేశారని ఆరోపించారు. ై రాడ్లు ఎంతో ఎత్తున ఉన్నాయని, రచన ఎత్తు తక్కువని.. ఎలా ఉరి పోసుకుందో అధికారులకే తెలియాలంటూ తల్లిదండ్రులు వాపోయారు. పెదపాడు తహసిల్దార్ జీజేఎఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *