Friday, 6 November 2026

మధుయాష్కీపై కేసు నమోదు

మాజీ ఎంపీ మధుయాష్కీ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ బుధవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో చిల్కూరు బాలాజీ దేవాలయ అర్చకులు, ట్రస్టీ రంగరాజు ఫిర్యాదుచేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను యుగపురుషుడు అంటూ ప్రశంసించిన చినజీయర్ పై అసభ్య వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని రంగరాజు ప్రశ్నించారు. అసభ్య వ్యాఖ్యలతో అర్చక సమాజం మనోభావాలను దెబ్బతీసిన మధుయాష్కీ పై చర్యలు తీసుకోవాలని రంగరాజు ఫిర్యాదు చేశారని ఎస్ఐ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *