Friday, 6 November 2026

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు

నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 14(జనంసాక్షి):నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాటశాల నందు రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలను పురస్కరించుకొని విద్యార్థినులకు ఎస్ ఏ రైటింగ్,డ్రాయింగ్,స్పీచ్,సింగింగ్ కాంపిటషన్స్ నిర్వహించడం జరిగింది.ఈ కాంపిటీషన్స్ లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు రెడ్ క్రాస్ సొసైటి సెక్రెటరీ సి.రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మేమొంటోలు మరియు సర్టిఫికెట్లు అందించడం జరిగింది.ఈ సదర్భంగా ఆయనమాట్లాడుతూ,విద్యార్థినులకు చిల్డ్రన్స్ డే శుభాాంక్షలు తెలిపారు,పాటశాల స్థాయిలో విద్యార్థులలోనీ ప్రతిభను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన కార్య్రమంలో విద్యార్థినులు చాలా ఉస్తహంగా పాల్గొన్నారనీ పాల్గొన్నా ప్రతి విద్యార్థినికి ప్రశంసా పాత్రలు అందిస్తూ అభినందించారు.ఈ కార్య్రమానికి అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ లతా మాట్లాడుతూ,జిల్లా రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని మరిన్ని మంచి కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించాలని కోరారు.ఈ కార్య్రమంలో యూత్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ డి.కుమార్,రెడ్ క్రాస్ సభ్యులు కృష్ణా రావు,సురేష్ బాబు,పాఠశాల జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ పద్మ పాల్గొన్నారు.