Friday, 6 November 2026

బాల్య స్మృతులు మరపురాని మధుర జ్ఞాపకాలు -కలెక్టర్ శశాంక

బాల్య స్మృతులు మరపురాని మధుర జ్ఞాపకాలు
-కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్ 14(జనంసాక్షి)

బాల్య స్మృతులు మరపురానివని, బాలలందరూ మధుర జ్ఞాపకాలుగా మిగిల్చుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం గిరిజన భవన్ లో నవంబర్ 14 స్వర్గీయ మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి అత్యధిక సంఖ్యలో బాలలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య స్మృతులు మరుపు రానివని బాలలందరూ మధుర జ్ఞాపకాలుగా మిగిల్చుకోవాలని అన్నారు. బాలలందరూ కలిసిమెలిసి విద్యతో పాటుగా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు తదితర అంశాలలో కూడా పాల్గొని రాణించాలన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటేనే విద్యలో రానిస్తామన్నారు. ఈ సందర్భంగా కేసముద్రం లో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో వివేకానంద స్కూలు లో విద్యను అభ్యసిస్తున్న ఇరువురు విద్యార్థు లైన రంజిత్ ,నునావత్ సిద్దు ప్రాణాలకు తెగించి ముగ్గురి ప్రాణాలను కాపాడడం తో వారు చూపించిన తెగువకు కలెక్టర్ అభినందించి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వక్తృత్వం వ్యాసరచన చిత్రలేఖనం పోటీల లో పాల్గొని విజేతగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతుల ను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శన సభకు ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని నర్మద, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి సత్యనారాయణ, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగవాణి, సభ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.