డోర్నకల్ జనవరి 26 జనం సాక్షి
కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ముందు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.అనంతరం అంబేడ్కర్,మహాత్మాగాంధీ మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.నాడు పోరాటాల ఫలితమే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కాశం శేఖర్,భీమా నాయక్, సుమీర్ జైన్,దోమల లక్ష్మణ్,వెంకటేశ్వర్లు,ఐలయ్య,గోపయ్య,విష్ణువర్ధన్ రెడ్డి, రామకోటియాదవ్, మల్లేష్,నవీన్,శివరాం,దాసు, గుగులోతు వినోద్ కుమార్,శంకర్,అఖిల్, తరుణ్,ధోని,ఆర్కే తదితరులు పాల్గొన్నారు.




