రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 26. (జనం సాక్షి). జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ జిల్లాపోలీసు కార్యాలయంలో 74వ,గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకమై శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు విష్ణు ప్రసాద్, నాగేంద్ర చారి, రవికుమార్, బాలకిషన్ ఆర్ఐ రజినీకాంత్, కుమారస్వామి, యాదగిరి ,అనిల్ కుమార్, ఉపేందర్, నవీన్ కుమార్, సర్వర్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.




