రెపోరేటు 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

ముంబై, జనంసాక్షి: వార్సిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ సమీక్షించింది. ఇవాళ సమీక్ష నిర్వహించిన అనంతరం రెపోరేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేటును తగ్గిస్తూ, నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచింది. వృద్ధిరేటు 5.7 శాతం. 2013-14 లో ద్రవ్యోల్భణం 5.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. కరెంట్‌ ఖాతా లోటు ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.