పవన్ కళ్యాణ్ భరోసా
కాకినాడ,నవంబర్5(జనంసాక్షి): ఈ రోజు నుంచి తాను రెల్లి కులస్థుడినని, ఆ విషయాన్ని తాను గర్వంగా చెప్పుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన పవన్.. రెల్లి కులస్థులకు తాను అండగా ఉంటానని హావిూ ఇచ్చారు.
అణగారిన కులాల్లోనే అణగారిన వర్గం రెల్లి కులం అని, ఇలాంటి వాళ్లకు అండగా నిలబడనప్పుడు తమ పార్టీ పెట్టి ప్రయోజనం ఏముందని పవన్ అన్నారు. ‘ఇల్లు అద్దెకు ఇస్తారా? అని అడిగే దౌర్భాగ్యం విూకు ఏంటమ్మా? వేరేవాళ్లు వచ్చి మిమ్మల్ని అద్దెకు అడగాలి. అలాంటి జీవితాన్ని నేను విూకు ఇస్తాను. రెల్లి కులస్థులైన విూరు బాధపడడం ఏమిటి? అన్ని కులాల మలమూత్రాలను తీసి శుభ్రపరిచే విూరు ఉన్నత కులస్థులు. అలా చేయాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. అంత పెద్ద మనసు రెల్లి కులస్థులకే ఉంది. ఈ
రోజు నుంచి విూ గొంతు నాది. విూరు బాధ పడకండి. విూకు అండగా ఉంటా.అని జనసేనాని భరోసా ఇచ్చారు.




