Thursday, 5 November 2026

రెవిన్యూ మిగులు భూమిని లాక్కోవడం దుర్మార్గం

రెవిన్యూ మిగులు భూమిని లాక్కోవడం దుర్మార్గం

వేమనపల్లి,నవంబర్ 16,(జనంసాక్షి):

ఆదివాసీలు సాగు చేసుకుంటున్నా రెవిన్యూ మిగులు భూమిని ఆటవీ అధికారులు ఆదివాసులను బెదిరించి బలవంతంగా లాక్కోవడం అత్యంత దుర్మార్గమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం వేమనపల్లి తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ అధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆదివాసులపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బెదిరించి అటవీ శాఖ అధికారులు బలవంతంగా భూమిని లాక్కున్నారని అన్నారు.రెవెన్యూ పట్టా కలిగి ఉన్న భూములను అటవీ అధికారులు లాక్కునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
వెంటనే అధికారులు స్పందించి మా ఆదివాసి గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని లేని యెడల తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు