రెవెన్యూ డిపార్ట్మెంట్ కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన రేషన్ డీలర్లు
టేకులపల్లి, జనవరి 3( జనం సాక్షి): టేకులపల్లి తహసిల్దార్ కెవి శ్రీనివాసరావు తో పాటు రెవెన్యూ శాఖ అధికారులకు మండల రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో మంగళవారం తహసిల్దార్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో టేకులపల్లి రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘ మండల అధ్యక్షులు ఆంగోతు సంతులల్, జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర రామ, డీలర్స్ జి. కళ్యాణ్, ధారావతు తవురియా, ఎస్.దుర్గా రావు, డి. సైద్దమ్మ, టి రమేష్, వి .వెంకటేష్, టి నగేష్ పాల్గొన్నారు.




