Tuesday, 3 November 2026

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే
ఖమ్మం అర్బన్, జనవరి 3(జనంసాక్షి) విద్య ద్వారానే మహిళలకు సాధికారత లభిస్తుందని చెప్పటమే కాకుండా తన జీవితాన్ని మహిళల విద్య కోసం అంకితం చేసిన చదువు తల్లి సావిత్రిబాయి పూలే అని బహుజన జెఎసి జిల్లా చైర్మన్ దేశబోయిన సంపత్ కుమార్, జిల్లా కన్వీనర్ దుంపటి సందీప్ లు కొనియాడారు. మంగళవారం పూలే చౌక్లో పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ కన్వీనర్ సర్వ నాగసంతోష్, నాయకులు నాగార్జున, రమేష్, షారుక్, భాను, బుద్ధి విజయ్, కోటి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.