Tuesday, 3 November 2026

రెవెన్యూ “సమస్యలు పరిష్కరించండి.

రెవెన్యూ “సమస్యలు పరిష్కరించండి.
భైంసా రూరల్ మార్చ్ 29జనం సాక్షిముధోల్ నియోజక వర్గంలోని  కొందరు  రైతులకు సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు రావడం లేదని, ఈ సమస్యని పరిష్కరించాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి  రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ని కలిసి విన్నవించారు. నూతనంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను హైదరాబాద్ లోని  కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ప్రభుత్వం చెరువులు, కాలువలు, రోడ్ల అభివద్ధికి కొంత భూ సేకరణ చేయగా సంభదింత పట్టా లో మిగిలిన భూమి కి  రైతు బంధు రావడం లేదన్నారు. దీంతో రైతులు పంట పెట్టుబడి సహాయం కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారుల సంభదిత  నివేదిక ను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు . ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి హామీ ఇచ్చారు.