Monday, 2 November 2026

రేకులు లేచిన ఇంటికి ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ నాయకులు

టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి): ఇటీవల గాలి దుమారానికి టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామంలో ఓ పేద గృహిణి ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి. సులానగర్ ఎస్సీ కాలనీకి చెందిన ఉండేటి రాణి వ్యవసాయ కూలి పనులు చేసుకునే పేద దళిత గృహిణి పది రోజుల క్రితం గాలి దుమారానికి ఇంటి పైకప్పున ఉన్న సిమెంట్ రేకులు లేచి ధ్వంసం అయ్యాయి. సులానగర్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య ఆధ్వర్యంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు,యువకులు ఆర్థిక సహాయంతో ఇంటి పైకప్పు కావలసిన రేకులను అందించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి చౌదరి, బల్లెం సుధాకర్, కాలే వంశీ, కాలే సుందరయ్య, మాలప్రోలు రవి,జంగం ఎలీషా, చిలకబత్తిని రవి తదితరులు పాల్గొన్నారు.