Tuesday, 3 November 2026

బై బై కృష్ణారావు,బై బై కేసీఆర్,బై బై బీఆర్ఎస్ అంటు ఎమ్మెల్యే కృష్ణారావు పై బీజేపీ నేత కన్నె ప్రకాష్ ఆరోపణలు

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 01 కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో గల ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ లో ఉన్న హస్మత్ పేట చెరువుగా పిలువబడే బోయిన్ చెరువు వద్ద రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గసభ్యుడు, స్థానిక నాయకుడు కన్నె ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుపైమరోసారివిరుచుకుపడ్డారు.ఇదిఇలాఉండగా కూకట్ పల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ జి.శ్రీకర్ రావు, మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు ఎనుగుల తిరుపతి ముఖ్య అతిథులుగా పాల్గొనగా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి,ఎస్సి మోర్చ ఉపాధ్యక్షుడు జగదీష్ మాదిగ, ఆఫీస్ ఇన్చార్జి కె.రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎనుగుల తిరుపతి మాట్లాడుతూ ఒక పక్క ముఖ్య మంత్రి కేసీఆర్ బృందం రాష్ట్రాన్ని దోచుకుని తింటుంటే,కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు యధేచ్చగా చెరువుల స్థలాలు కబ్జాలకు పాల్పడుతు , సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ శ్రీకర్ రావు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్న చెరువుల సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకోవడమే కాకుండా భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. అనంతరం రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ మాట్లాడుతూ తనదైన శైలిలో మరో సారి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పై విరుచుకుపడ్డారు. కృష్ణారావు ఫాం హౌస్ పరిమితమైన ఆయన ఫాం హౌస్ చెరువులో నీరు తేటతెల్లగా ఉంటాయి, చేపలు, రొయ్యలు హుషారుగా పెంపకంతో ఒక్కొక్క మామిడి పండు రెండేసి కిలోల బరువు ఉంటుందని స్వయంగా తెలిపిన మీరు మరి బోయిన్ చెరువు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రకాష్ పలు ఆరోపనలు గుప్పించారు.బోయిన్ చెరువు లో చేపలు, రొయ్యలు ఎందుకు పెంచడంలేదని ప్రకాష్ ప్రశ్నించారు.వాకింగ్ ట్రాక్ పూర్తి చేసి నేటికీ ప్రారంచక పోవడం మీ అవినీతి అక్రమాలకు నిదర్శనం అని కూడా ప్రకాష్ అన్నారు.ఈ సందర్భంగా బీజేపీ బీజేవైఎం నేతలు బైబై కేసీఆర్ బైబై కృష్ణరావు బైబై బీఆర్ఎస్ అంటు నినాదాలు చేశారు.