రఘునాథ పాలెం జూన్ 15 ( జనం సాక్షి) మండల గ్రామ సర్పంచ్ చే జాతీయ జెండా ఆవిష్కరించి, గ్రామసభ నిర్వహించారు గ్రామ సభలో పల్లె ప్రగతి లో జరిగిన అభివృద్ధి, ప్రయోజనాలు గురించి వివరించటం జరిగింది.హాజరైన వారితో ప్లెక్షి పైన సంతకాలు చేయటం జరిగింది.యంపిడబ్య లకి ఘనంగా సన్మానించి, ప్రశంస పత్రం లను సర్పంచ్ చేతుల మీదుగా అందించటం జరిగింది.అనంతరం గ్రామంలో పల్లె ప్రగతి ర్యాలీ నిర్వహించారుఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కొర్లపాటి రామారావు, ఉపసర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు వార్డ్ సభ్యులు ఎయంసి డైరెక్టర్ నున్నా శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి. సంగీత అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయితీ, సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రేగులచలక గ్రామ పంచాయితీ నందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పల్లె ప్రగతి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు




