జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా
కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, బోనాల జాతరకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ దంపతులు మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలు, పాడిపంటలతో ఆనందంగా ఉండాలని వారు వేడుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకుల తో పాటు గ్రామ సర్పంచ్ శంకర్ గౌడ్ పుట్ట దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పుట్ట దంపతుల పూజలు




