Thursday, 5 November 2026

రేపటినుండి పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన. పాలీసెట్ జిల్లాకో.ఆర్డినేటర్ ఎస్.విద్యా రాణి.

బిజినేపల్లి. జనం సాక్షి. జూన్. 16.పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ లో భాగంగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు నేటి నుండి 19 వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలన నాగర్ కర్నూల్ జిల్లా పాలెంలో గల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతుందని పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.విద్యారాణి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు ఈ కేంద్రాన్ని ఎంచుకున్న విద్యార్థులు తమ విద్యార్హతలు గల ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు రెండు సెట్లు జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని తెలిపారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు కార్డు, పాలిసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్ సి లేదా సమాన విద్యార్హత క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్, నాలుగు నుండి పదవ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం,టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం,ఇ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ లను తీసుకుని స్లాట్ బుకింగ్ లో ఇచ్చిన సమయం ప్రకారం పాలిసెట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కేంద్రానికి హాజరు కావాలని ఆమె కోరారు