Friday, 6 November 2026

రేపటి నుంచి విద్యార్థులకు హాల్‌టికెట్లు:చిరంజీవులు

r35l28e7హైదరాబాద్: రేపటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిరంజీవులు తెలిపారు. ఇవాళ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేశామని తెలిపారు. పోలీస్, ఆర్టీసీ, తపాలా,వైద్య,ఆరోగ్య శాఖల సాయంతో పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు కావాల్సిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నం:040 23230941,42 కు డయల్‌చేసి తెలిసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,614 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 11 వరకు జరుగనున్న పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా బాలురు-2,92,594 మంది, బాలికలు-2,72,119 మంది హాజరవనున్నట్టు తెలిపారు. పరీక్షల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండవని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *