రేపు ఉచిత బ్యాంకు ఖాతాలు.
నెన్నెల, జులై 8, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని ఎస్బీఐ సర్వీస్ పాయింట్ లో సోమవారం ప్రజలకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వబడుతాయని ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు గట్టు సంతోష్ తెలిపారు. ఎస్బీఐ ఖాతా కావాలనుకునే వారు ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో తమను సంప్రదించలన్నారు. మండల ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.