Wednesday, 4 November 2026

రేపు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి

 

రామకృష్ణా పూర్, (జనంసాక్షి) :చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు వేడుకలకు, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామాలయంలో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ, పలు అభివృద్ధి పనులకార్యక్రమానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి సదయ్య రామకృష్ణాపూర్ సింగరేణి టాగూర్ స్టేడియాన్ని, రామాలయం సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సిఐ, ఎస్ఐలకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై బి అశోక్ , బి.ఆర్.ఎస్ పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, రేవెల్లి ఓదెలు, పోగుల మల్లయ్య,కో ఆప్షన్ సభ్యులు సుదర్శన్ గౌడ్, తదితరు పాల్గొన్నారు.