- ఆర్‌వోబీ పనుల వల్ల 4,5,6 తేదీల్లో రామగుండం – పెగ్గంపేట స్టేషన్ల మధ్య అంతరాయం
సికింద్రాబాద్, (మార్చి3): సిర్పూర్ కాగజ్‌నగర్ ఓపెన్ కాస్ట్ పనుల్లో భాగంగా రేపు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. ఆర్‌వోబీ పనుల కారణంగా ఈనెల 4,5,6 తేదీల్లో రామగుండం – పెగ్గంపేట స్టేషన్ల మధ్య పలు రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 4వ తేదీన సిర్పూర్ టౌన్-కాజీపేట రామగిరి ప్యాసింజర్ రద్దు. దక్షిణమధ్య రైల్వే వరంగల్ వరకే భద్రాచలం-సిర్పూర్ ప్యాసింజర్, రామగుండం వరకే హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ . కాజీపేట వరకే సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ , పెద్దపల్లి వరకే కరీంనగర్-సిర్పూర్ టౌన్ డెమో ప్యాసింజర్. రైల్వే 5వ తేదీన సికింద్రాబాద్-పాట్నా ఎక్స్‌ప్రెస్ ఉ.11గంటలకు బయలుదేరుతుంది, సిర్పూర్-కాజీపేట రామగిరి ప్యాసింజర్ ఉ.4.15బయలుదేరుతుంది: ద.మ.రైల్వే 6వ తేదీన సిర్పూర్ కాగజ్‌నగర్-కాజీపేట రామగిరి ప్యాసింజర్ రద్దు.




