హైదరాబాద్ : సచివాలయంలో మీడియాకు ఆంక్షలపై సందేహాలను సీఎం కేసీఆర్ నివృత్తి చేయనున్నారు. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం 2 గంటలకు జర్నలిస్టులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రెస్ అకాడమీలో జరగనుంది. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపై వారితో సీఎం నేరుగా చర్చించనున్నారు.





