హైదరాబాద్: ముఖ్యమంతి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరుగనున్న నీతి అయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వ పథకాలపై నీతి ఆయోగ్ సబ్‌గ్రూప్ సభ్యులు చర్చించనున్నారు. నీతి ఆయోగ్ సబ్‌గ్రూప్ సభ్యులు రేపు సాయంత్రం ప్రధానికి తుది నివేదిక ఇవ్వనున్నారు.
ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించే అవకాశముంది. ఢిల్లీ పర్యటనకు నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కేసీఆర్ సమావేశమై గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీని కూడా కలిసే అవకాశం ఉంది.




