Wednesday, 4 November 2026

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో మితిమీరి పోతున్న ఫీజుల పెంపు వ్యవహారంపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు బంద్‌ పాటించాలని ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, సీఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులంతా ఈ బంద్‌కు సహకరించాలని కోరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *