హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అరుణాచల ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరుణాచలప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సెజు వి కురువిల్లి తెలిపారు. రాష్ట్ర, సీఆర్పీఎఫ్, ఐఆర్‌బీఎన్ పోలీసులు సంయుక్తంగా భద్రత ఏర్పాట్లలో పాల్గొంటున్నారని తెలిపారు.




