Wednesday, 4 November 2026

రేపు రైళ్ల రాకపోకలు యథాతథం

సికింద్రాబాద్‌: శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులలతో పాటు అన్ని రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యగా రైళ్లల్లో భద్రతను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో   సాంబశివరావు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *